: ‘రైజర్స్’కు కేసీఆర్ గ్రీటింగ్స్!
నిన్న ముగిసిన ఐపీఎల్ సిరీస్ లో సత్తా చాటి విజేతగా నిలిచిన హైదరాబాదు సన్ రైజర్స్ జట్టుకు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిన్న రాత్రి ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో కోహ్లీ సేనపై అన్ని విభాగాల్లో ఆధిక్యం ప్రదర్శించిన సన్ రైజర్స్ జట్టు విజయం సాధించి ఐపీఎల్-9 విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేసీఆర్... సన్ రైజర్స్ జట్టు సభ్యులతో పాటు ఆ జట్టు యాజమాన్యం, అభిమానులకు కూడా శుభాకాంక్షలు తెలిపారు.