: ‘భారతమాతా కీ జై’ అనకుంటే దేశంలో ఉండే అర్హత లేదు: బీజేపీ నేత కిషన్ రెడ్డి
తెలంగాణ బీజేపీ శాసనసభాపక్ష నేత (బీజేఎల్పీ) గా కిషన్ రెడ్డి ఎన్నికయ్యారు. బీజేఎల్పీ నేతగా ఇప్పటివరకు లక్ష్మణ్ వ్యవహరించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఆయన ఇటీవల నియమితులవడంతో ఆ స్థానంలో కిషన్ రెడ్డిని ఎన్నుకున్నారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ‘భారత మాతా కీ జై’ అనే నినాదాన్ని పలకనివారికి ఈ దేశంలో ఉండే అర్హత లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలమైన పార్టీగా ఎదగడం ఖాయమని, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని అభిప్రాయపడ్డారు. 2019లో తెలంగాణ లో అధికారం కైవసం చేసుకోడం ఖాయమని చెప్పిన కిషన్ రెడ్డి, మజ్లిస్ పార్టీ పుంజుకుంటే దేశానికే నష్టమని వ్యాఖ్యానించారు.