: ముగిసిన టీడీపీ మహానాడు... 28 తీర్మానాలకు ఆమోదం
తిరుపతిలో మూడు రోజుల పాటు నిర్వహించిన టీడీపీ మహానాడు ఈరోజుతో ముగిసింది. ఈ సందర్భంగా మొత్తం 28 తీర్మానాలు ఆమోదం పొందాయి. మహానాడుకు ఏపీ, తెలంగాణ నుంచి టీడీపీ శ్రేణులు భారీగా హాజరయ్యాయి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముగింపు ఉపన్యాసంతో మూడు రోజుల పాటు నిర్వహించిన మహానాడు ముగిసింది. ‘ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలం కావాలని ఆనాడు గోదావరి పుష్కరాల సందర్భంగా ఒక మహా సంకల్పం చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. పట్టిసీమ పూర్తి కావాలి... పోలవరం పూర్తి కావాలి... పోలవరం నీళ్లు కృష్ణాకు.. కృష్ణా నీళ్లు పెన్నాకు వెళ్లాలని, ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలం కావాలని మహా సంకల్పం చేశానని, అది ఇప్పుడు కార్యరూపం దాల్చిందని చంద్రబాబు చెప్పారు. రేపు కృష్ణా పుష్కరాలు రానున్నాయని, ఈ మహా సంకల్పాన్ని దృఢ సంకల్పంగా ముందుకు తీసుకుపోతామని’ సీఎం పేర్కొన్నారు.