: ప్రధాని మోదీని కలవాలనుకుంటే ఈ క్విజ్ లో పాల్గొంటే సరి!
దేశంలో రెండేళ్ల పరిపాలన పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీని కలవాలనుకునే వారికి మంచి అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. మోదీని కలవాలనుకునే వారు, ప్రభుత్వ వెబ్ సైట్ లో నిర్వహించనున్న ఒక క్విజ్ లో పాల్గొనాలి. మొత్తం 20 ప్రశ్నలు ఉండే ఈ క్విజ్ ను ఐదు నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ క్విజ్ లో పాల్గొనాలంటే ముందుగా, www.mygov.in అనే వెబ్ సైట్ లో పేరు నమోదు చేసుకోవాలి. పేర్లు నమోదు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 5 అని ప్రభుత్వాధికారులు వెల్లడించారు. ఈ క్విజ్ లో విజయం సాధించిన వారికి మోదీ సంతకంతో చేసిన సర్టిఫికెట్ తో పాటు ప్రధానిని పర్సనల్ గా కలిసే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వాధికారులు పేర్కొన్నారు.