: నటుడు కళాభవన్ మణి మృతి కేసులో బలపడుతున్న అనుమానాలు


దక్షిణాది నటుడు కళాభవన్ మణి మృతిపై అనుమానాలు బలపడుతున్నాయి. గత ఏడాది మార్చి 6న అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన మణి దేహంలో అత్యంత విషపూరితమైన మిథైల్ ఆల్కహాల్ అవశేషాలు కనుగొన్నట్లు ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. హైదరాబాద్ కు చెందిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ (సీఎఫ్ఎస్ఎల్) నిర్వహించిన పరీక్షల్లో ఈ విషయం వెలుగుచూసింది. ఈ నివేదికపై స్పష్టత కోసం కేరళ పోలీసులు సీఎఫ్ఎస్ఎల్ ను సంప్రదించనున్నారు. ఎంత శాతం మిథైల్ ఆల్కహాల్ మణి శరీరంలో ఉందనే విషయం మాత్రం వెల్లడి కాలేదు.

  • Loading...

More Telugu News