: లెఫ్టినెంట్ గవర్నర్ గా కొత్త బాధ్యతలు స్వీకరిస్తున్న కిరణ్ బేడీ


మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఈ రోజు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, పుదుచ్చేరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్య సంరక్షణ, పరిశ్రమలు మొదలైన రంగాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగేలా చూస్తానని అన్నారు. ముఖ్యంగా పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఆమె చెప్పారు. కాగా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కిరణ్ బేడీని నియమిస్తూ ఈ నెల 22న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేసిన సంగతి విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News