: చైనాలో 55 విమానాలను టేకాఫ్ కాకుండా ఆపిన డ్రోన్


గాల్లో ఎగురుతున్న గుర్తు తెలియని ఒక డ్రోన్.. 55 విమానాలు మూడు గంటల పాటు నిలిచిపోయేలా చేసింది. ఈ ఘటన చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ లో నిత్యమూ బిజీగా ఉండే చెంగ్డూ షాంగ్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ ను ఆపరేట్ చేస్తూ, దాన్ని విమానాశ్రయం రన్ వే పైకి పంపగా, బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న 55 విమానాలను నిలిపివేశారు. దీంతో ప్రమాదం లేదని తెలుసుకున్న తరువాత టేకాఫ్ కు అనుమతించారు. డ్రోన్ కారణంగా ఇంత పెద్ద సంఖ్యలో విమానాలకు అంతరాయం కలగడం ఇదే తొలిసారి.

  • Loading...

More Telugu News