: కాల్చితే చచ్చిపోడా... నాకు బీపీ, షుగరు, గుండెజబ్బు వున్నాయి.. ఏం చేశానో తెలియదు: కాల్పులు జరిపిన రామకృష్ణంరాజు


పశ్చిమ గోదావరి జిల్లా గొల్లల కోడేరు సర్పంచ్ సూర్యనారాయణరాజుపై కాల్పులు జరిపిన ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేసిన రామకృష్ణంరాజు, పోలీసు స్టేషన్ లో మీడియాతో మాట్లాడారు. "నేనేం కాల్చలేదు. కాల్చితే చచ్చిపోడా? బతికుంటాడా? ఓకేసారి నా దగ్గరకు పది మందితో వచ్చాడు. కంగారులో నాకు... బీపీ, షుగరు, గుండెజబ్బులు ఉన్నాయి. ఏం చేశానో తెలియదు" అని అన్నారు. సూర్యనారాయణరాజుపై రామకృష్ణంరాజు కాల్పులు జరుపగా, ఆయన ఎటువంటి గాయాలు కాకుండా తప్పించుకున్న సంగతి తెలిసిందే. 25 సెంట్ల భూమి వివాదంలో వీరిద్దరి మధ్యా కొంతకాలంగా వివాదం చెలరేగుతోంది.

  • Loading...

More Telugu News