: ఫీజుల పెంపును నిరసిస్తూ గంటా క్యాంపు కార్యాలయం ముట్టడి... విశాఖలో ఉద్రిక్తత!


ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజులు భరించలేనంతగా పెంచారని, వీటిని తక్షణం నియంత్రించి తల్లిదండ్రులకు ఊరట కలిగించాలని డిమాండ్ చేస్తూ, విశాఖలోని మంత్రి గంటా శ్రీనివాసరావు క్యాంపు కార్యాలయాన్ని బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. క్యాంపు కార్యాలయం వద్దకు దూసుకొచ్చిన ఏబీవీపీ కార్యకర్తలు బైఠాయించి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఏబీవీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషనుకు తరలించారు. నిరసన సమయంలో మంత్రి గంటా క్యాంపు కార్యాలయంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. జీవీఎంసీ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News