: పవన్ కల్యాణ్ కు ఫోన్ చేసి ముద్రగడ పద్మనాభంతో మాట్లాడించిన పళ్లంరాజు


తనను కలిసిన కాపు నేత ముద్రగడ పద్మనాభంను పవన్ కల్యాణ్ తో ఫోన్ లో మాట్లాడించారు కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు. ఈ ఘటన నేటి ఉదయం జరిగింది. హైదరాబాద్ కు వచ్చిన పద్మనాభం, కాపు ఉద్యమానికి మద్దతు తెలిపిన మాజీ మంత్రులు చిరంజీవి, దాసరి తదితరులను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే క్రమంలో ఆదివారం ఉదయం పళ్లంరాజు ఇంటికి వెళ్లి ఆయన్ను కలిశారు. ఆ సమయంలో పవన్ కల్యాణ్ కు ఫోన్ చేసిన పళ్లంరాజు, దాన్ని ముద్రగడకు ఇచ్చి మాట్లాడాలని కోరగా, కాపుల భవిష్యత్తు కోసం తాను చేపట్టిన ఉద్యమానికి మద్దతివ్వాలని పవన్ ను కోరినట్టు సమాచారం. దీనికి పవన్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News