: వరంగల్ మాజీ ఎంపి కల్పనాదేవి కన్నుమూత
వరంగల్ మాజీ ఎంపీ, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో చేరి ప్రజలకు సేవలందించి, ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న టీ కల్పనాదేవి గత అర్ధరాత్రి హైదరాబాద్ లో కన్నుమూశారు. గుండెపోటు వచ్చిన ఆమెను గ్లోబల్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కన్నుమూసినట్టు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1983లో ఎన్టీఆర్ పిలుపుమేరకు తెలుగుదేశం పార్టీలో చేరిన ఆమె, వరంగల్ స్థానానికి ఎంపీగా విజయం సాధించారు. ఆపై కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1989 ఎన్నికల్లో ఓటమి పాలైన తరువాత క్రియాశీల రాజకీయాలకు స్వస్తి చెప్పారు. ఆమెకు ఇద్దరు కుమారులు కాగా, ఇరువురూ వైద్య వృత్తిలో స్థిరపడ్డారు. కల్పనాదేవి మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.