: మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది తారిఖ్ అరెస్టును ధ్రువీకరించిన భారత సైన్యం


రూ. 3 లక్షల రివార్డున్న హిజబుల్ ముజాహిద్దీన్ కీలక సభ్యుడు, ఎంతోకాలంగా సైన్యం వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ తారీఖ్ పండిట్ ను అరెస్ట్ చేసినట్టు భారత సైన్యం ధ్రువీకరించింది. ఏ కేటగిరీ మిలిటెంటుగా గుర్తింపు తెచ్చుకున్న తారీఖ్, ఉగ్రసంస్థ పోస్టర్ బాయ్ బుర్హాన్ వానీకి అత్యంత సన్నిహితుడని అధికారులు తెలిపారు. అతని గురించిన సమాచారం అందిస్తే, రివార్డు ఇస్తామన్న ప్రకటనతో తమకు లభించిన సమాచారం అరెస్టుకు దారితీసిందని వివరించారు. కాగా, పుల్వామా జిల్లాలో పోలీసులకు తారీఖ్ లొంగిపోయినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తారీఖ్ పట్టుబడటం హిజబుల్ ముజాహిద్దీన్ భారత కార్యకలాపాలకు పెద్ద దెబ్బని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News