: భారత చరిత్రలో తొలిసారి... నోటిఫికేషన్ తరువాత ఎన్నికల రద్దు!


ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ వెలువరించిన తరువాత, ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే పోలింగ్ వాయిదా పడుతుందే తప్ప, ఎన్నిక ఆగదన్న సంగతి తెలిసిందే. అయితే, భారత చరిత్రలో తొలిసారిగా నోటిఫికేషన్ ను కాదని, ఏకంగా ఎన్నికనే రద్దు చేసిన ఘటన జరిగింది. మొన్నటి ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో తమిళనాడులోని తంజావూరు, అరవకురిచి నియోజకవర్గాల్లో ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసిన కోట్లాది రూపాయల నగదు, తాయిలాలను చూసిన ఈసీ, ఈ రెండు నియోజకవర్గాల్లో ఎన్నికను తొలుత మే 23కు, ఆపై జూన్ 13కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇక అక్కడి ఎన్నికల పరిశీలకులు ఇచ్చిన నివేదికలను పరిశీలించిన తరువాత జూన్ 13న కూడా ఎన్నిక జరుపబోమని, తిరిగి తాజాగా నోటిఫికేషన్ వెలువరించి సాధ్యమైనంత త్వరలో ఎన్నికలు జరుపుతామని ఈసీ స్పష్టం చేసింది. తమిళనాట ఎన్నికల్లో చరిత్ర సృష్టిస్తూ, మూడు దశాబ్దాల తరువాత వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన పార్టీగా ఏఐఏడీఎంకే నిలువగా, జయలలిత ముఖ్యమంత్రిగా ఆరవసారి పదవీ ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News