: మరింతగా దిగివచ్చిన బంగారం ధర!
రెండు వారాల క్రితం రూ. 30 వేలకు పైగా ఉన్న పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర అమ్మకాల ఒత్తిడి పుణ్యమాని మరోసారి రూ. 29 వేల స్థాయికన్నా కిందకు దిగివచ్చింది. శనివారం నాడు ముంబై బులియన్ మార్కెట్ సెషన్ ముగిసేసరికి బంగారం ధర రూ. 28,850 వద్దకు చేరింది. స్టాక్ మార్కెట్లు జోరు మీద ఉండటంతో, ఇన్వెస్టర్లు బులియన్ పెట్టుబడులను ఈక్విటీ మార్కెట్లోకి తరలిస్తున్నట్టు నిపుణులు వ్యాఖ్యానించారు. వెండి ధర కిలోకు రూ. 70 తగ్గి రూ. 39 వేలకు చేరుకుంది. మరోవైపు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.55 శాతం పడిపోయి 1,212 డాలర్లకు చేరింది. తదుపరి సెషన్లలోనూ విలువైన లోహాల ధరలు ఒడిదుడుకుల మధ్య మరింతగా తగ్గవచ్చని అంచనా.