: 2 కోట్ల వ్యూస్ తో 'కబాలి' సరికొత్త రికార్డు
భారత సినీ చరిత్రలో రజనీకాంత్ ది ఓ ప్రత్యేకపేజీ. రజనీ ఏం చేసినా ప్రత్యేకమే... ఆయన స్టెప్పేసినా, నడిచినా, డైలాగ్ చెప్పినా అభిమానులకు పండగే. అలాంటి రజనీకాంత్ ప్రధాన పాత్రలో చెన్నైకి చెందిన డాన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న 'కబాలి' టీజర్ ను ఏప్రిల్ 30న విడుదల చేసిన సంగతి తెలిసిందే. విడుదల చేసిన కొద్ది కాలంలోనే ‘బాహుబలి’ ట్రైలర్ రికార్డును తిరగరాసింది. తాజాగా 2 కోట్ల వ్యూస్ తో 'కబాలి' సరికొత్త రికార్డును సృష్టించింది. దీనిపై ఈ సినిమా బృందం హర్షం వ్యక్తం చేసింది. అభిమానుల ఆదరణ మరువలేనిదని పేర్కొంది. సినీ చరిత్రలో ఇంతవరకు దక్కని రికార్డును సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందని ట్విట్టర్ లో పేర్కొంది. పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న 'కబాలి'ని కలైపులి ఎస్ థను నిర్మిస్తుండగా, రజనీకాంత్ సరసన రాధికా ఆప్టే నటించింది.