: టీటీడీ బోర్డుపై మండిపడి, బైఠాయించిన టీడీపీ ఎమ్మెల్యే


తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద టీడీపీ ఎమ్మెల్యే వీరంగం వేశారు. తిరుపతిలోని మహానాడులో పాల్గొనేందుకు వచ్చిన ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి.. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని భావించారు. దీంతో టీటీడీ బోర్డ్‌ సెల్‌ ఆఫీసుకు వెళ్లి బ్రేక్ దర్శనం టికెట్లు కావాలని డిమాండ్ చేశారు. అయితే సిబ్బంది టికెట్లు అయిపోయాయని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, ఇద్దరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు టికెట్లు కేటాయించినప్పుడు తనకెందుకు లేవంటున్నారని వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఆయన టీటీడీ వైఖరిని నిరసిస్తూ, సెల్‌ ఆఫీసు దగ్గర అనుచరులతో కలసి బైఠాయించారు.

  • Loading...

More Telugu News