: ప్రపంచ గొప్ప ఆర్థికవేత్తల్లో రాజన్ ఒకరు: చిదంబరం
బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుండగా, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఢిల్లీలో ఎన్డీయే రెండేళ్ల పాలనలో వైఫల్యాలను ఎండగట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచ గొప్ప ఆర్థివేత్తల్లో రఘురాం రాజన్ ఒకరని అన్నారు. ఆర్బీఐ గవర్నర్ గా ఆయన అర్హుడన్న విషయం కేంద్రం గుర్తిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీ, జైట్లీలలో ఎవరైనా రాజన్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి ఉంటే దానిపై తాను మాట్లాడేవాడినని చెప్పిన ఆయన, సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరించారు.