: అమెరికాలో డిగ్రీ చేస్తే ఇక ఆ దేశ పౌరులే!


అగ్రరాజ్యం అమెరికాలో సెటిలవ్వాలన్న వారికి శుభవార్త. ప్రతిపాదిత నూతన వలసవాద సంస్కరణల బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం తెలిపితే అమెరికాలో విద్యాభ్యాసం చేసేవారికి మంచి రోజులు రానున్నాయి. ఈ బిల్లును రూపొందించిన సెనేట్ ద్వైపాక్షిక బృందంలో సభ్యుడైన మెక్ కెయిన్ దీని గురించి మాట్లాడారు.

అమెరికాలో సైన్స్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ లో డిగ్రీ చేసి, ఉద్యోగావకాశం పొందితే చాలు... వారిక అమెరికా గ్రీన్ కార్డు పౌరసత్వానికి అర్హులవుతారని మెక్ కెయిన్ చెప్పారు. అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న వారిలో సగం మంది ఉన్నత డిగ్రీలను పొందుతున్నారని వెల్లడించారు. ప్రస్తుతం వారు అమెరికా పౌరులుగా లేరని చెప్పారు. వారు ఇక్కడే ఉద్యోగం సంపాదించి ఉండాలనుకుంటే స్వాగతిస్తామన్నారు.

  • Loading...

More Telugu News