: జూన్ 2న సీఎం చంద్రబాబుపై చీటింగ్ కేసులు పెడతాం: బొత్స సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్ అధికార టీడీపీ రెండేళ్ల పాలనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లోని వైసీపీ కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తోన్నా ఇంతవరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని అన్నారు. చంద్రబాబుపై వచ్చేనెల 2న చీటింగ్ కేసులు పెడతామని చెప్పారు. అమరావతి అమరేశ్వరుని భూముల కొనుగోలుపై విచారణ జరిపించాలని, లోకేశ్ ఆధ్వర్యంలోనే వెయ్యి కోట్ల దోపిడి జరిగిందని ఆయన ఆరోపించారు. తెలుగు దేశం పార్టీ నేతల దోపిడీపై తాము పోరాడతామని తెలిపారు.