: బాల భీముడే పుట్టాడు.. ఇండియాలోనే అతి బరువైన శిశువుకి జన్మనిచ్చిన మహిళ


కర్ణాటక రాజధాని బెంగళూరులోని హస్సన్‌లో 19ఏళ్ల గ‌ర్భిణీ ఇండియాలోనే అతి బ‌రువైన బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఇటీవ‌ల ఆసుప‌త్రిలో చేరిన గ‌ర్భిణీ నందినికి సిజేరియన్ స‌ర్జ‌రీ చేసి శిశువుని బ‌య‌ట‌కు తీశారు. ఆ శిశువు 6.82 కిలో గ్రాముల బ‌రువుతో ఇండియాలోనే అతి బ‌రువైన శిశువుగా పుట్టుకతోనే రికార్డులోకెక్కాడు. ఇండియాలో ఇప్ప‌టివ‌ర‌కు 5.8 కిలో గ్రాముల‌తో జ‌న్మించిన ఓ శిశువు పేరిట రికార్డు ఉండేద‌ని ఇప్పుడు త‌మ ఆసుప‌త్రిలో 6.82 కిలో గ్రాముల బ‌రువుతో జ‌న్మించిన ఈ శిశువు ఆ రికార్డును తిర‌గ‌రాశాడని అక్క‌డి హిమ్స్ వైద్యులు చెప్పారు. త‌ల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నార‌ని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News