: ప్ర‌త్యేక హోదాపై బీజేపీతో నేను మాట్లాడతా: న‌ంద‌మూరి బాల‌కృష్ణ


దివంగత నంద‌మూరి తార‌క రామారావు దేశ రాజ‌కీయాల్లో చ‌రిత్ర సృష్టించార‌ని, తెలుగు జాతి గౌర‌వాన్ని న‌లుదిశ‌లా చాటి చెప్పార‌ని సినీన‌టుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తెలుగుదేశం పార్టీ తిరుపతిలో నిర్వహిస్తోన్న మహానాడులో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన సభలో మాట్లాడారు. ‘తెలుగు వెలుగు ఎన్టీఆర్‌.. మేం మద్రాసీలం కాదు, తెలుగు వాళ్లం అని ఆయ‌న‌ చాటి చెప్పారు’ అని అన్నారు. రాజ‌కీయ అరంగేట్రం చేసి బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు ఆయ‌న ఎన్నో సేవ‌లు చేశార‌ని బాల‌కృష్ణ‌ అన్నారు. రాష్ట్రాభివృద్ధిని చేసే శ‌క్తి ఒక్క చంద్రబాబుకే ఉందని అన్నారు. ప్ర‌త్యేక హోదాపై బీజేపీతో తాను మాట్లాడుతాన‌ని బాల‌కృష్ణ చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు కాపాడుతూనే ఉన్నారని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News