: పక్కా గేమ్ ప్లాన్ తో సిద్ధమవుతున్నాం!... కోహ్లీకి డేంజర్ బెల్స్ మోగించిన వార్నర్!


సెకండ్ ప్లే ఆఫ్ లో ఘన విజయంతో హైదరాబాదు సన్ రైజర్స్ జట్టు ఐపీల్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తొలి బంతి నుంచి చివరి బంతి వరకూ క్రీజులో పాతుకుపోయి గుజరాత్ లయన్స్ జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు. చివరలో బిపుల్ శర్మ మెరుపులతో సన్ రైజర్స్ గెలుపు మరింత సునాయాసమైంది. వెరసి ఇప్పటికే ఫైనల్ చేరిన బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టుతో టైటిల్ పోరుకు వార్నర్ సన్నద్ధమవుతున్నాడు. నిన్న ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో విజయం తర్వాత వార్నర్ మీడియాతో మాట్లాడుతూ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి డేంజర్ బెల్స్ మోగించాడు. ఫైనల్ లో విజయం కోసం పక్కా ప్లాన్ సిద్ధమవుతున్నట్లు అతడు చెప్పాడు. ఫైనల్ లో కోహ్లీని నిలువరించడమే తాము ప్రధాన లక్ష్యంగా బరిలోకి దిగుతున్నామని చెప్పిన వార్నర్... బెంగళూరు జట్టుతో తమ గత ప్రదర్శన మెరుగైందన్నాడు. దీంతో కోహ్లీ, డివిలియర్స్, గేల్ లాంటి హేమాహేమీలున్నా, తామేమీ పెద్దగా ఆందోళన చెందడం లేదని వార్నర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News