: దేశంలో మోస్ట్ పాప్యులర్ సీఎంగా కేసీఆర్!: వీడీపీ అసోసియేట్స్ సర్వే
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. దేశ వ్యాప్తంగా 86 శాతం మంది ఆయన పాలనపై సంతృప్తికరంగా ఉన్నట్లు వీడీపీ అసోసియేట్స్ సర్వే వెల్లడించింది. దీంతో, కేసీఆర్ మోస్ట్ పాప్యులర్ సీఎంగా నిలిచారని ఆ సర్వే పేర్కొంది. అయితే, ఏపీ సీఎం చంద్రబాబు పాలనపై మాత్రం 69 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేశారని ఆ సర్వే పేర్కొంది. సీఎం కేసీఆర్ తర్వాతి స్థానాల్లో వరుసగా మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు ఉన్నారు.