: ప్రత్యేకహోదాపై మహానాడులో తీర్మానం... ఆమోదించిన బాబు
టీడీపీ మహానాడులో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై తీర్మానాన్ని ఆమోదించారు. తిరుపతిలో టీడీపీ నిర్వహిస్తున్న మహానాడులో ఏపీకి ప్రత్యేకహోదా తీర్మానాన్ని ఆ పార్టీనేత కాల్వ శ్రీనివాసులు ప్రవేశపెట్టారు. దానిని ఎంపీ అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు బలపరిచారు. దీనిని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోదించారు. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేకహోదా కల్పించాల్సిందేనని అన్నారు. విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ నెరవేర్చాలని కోరారు. ప్రత్యేకహోదా తీసుకువచ్చేందుకు బీజేపీ సహకరించాలని ఆయన అన్నారు. ఏపీతో పాటు వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేకప్యాకేజీ ఇవ్వాలని సుజయకృష్ణరంగారావు డిమాండ్ చేశారు.