: తెలుగు జాతికి జరిగిన నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేసుకోవాలో...?: ఏపీ సీఎం చంద్రబాబు


తెలుగు జాతికి జరిగిన నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేసుకోవాలా? అని నిత్యం ఆలోచిస్తున్నానని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో జరుగుతున్న మహానాడులో విభజన చట్టంలోని హామీల అమలు కోరుతూ కాల్వ శ్రీనివాసులు తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, విభజన జరిగిన తర్వాత రెండో మహానాడు నిర్వహిస్తున్నామన్నారు. విభజన జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం తండ్రి పాత్ర పోషించాల్సిన అవసరముందని, ఇద్దరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపించాలని, ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేయూత నివ్వాల్సిన అవసరముందన్నారు. ఏపీ ప్రజానీకానికి ఒక పక్క అవమానం, మరోపక్క అన్యాయం జరిగిందని, గాయం మానలేదని... కనుక తమకు సహకరించాలని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు తాను విజ్ఞప్తి చేశానని బాబు చెప్పారు. త్వరలోనే పిలుస్తానని, న్యాయం చేస్తానని ఈ సందర్భంగా ప్రధాని మోదీ కూడా తనకు హామీ ఇచ్చారని అన్నారు. విభజన చట్టంలో ఉన్న హామీలన్నింటిని కూడా పరిష్కారం చేయమని మహానాడు ద్వారా కేంద్రానికి మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నానని చంద్రబాబు అన్నారు.

  • Loading...

More Telugu News