: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం: రమణ్ సింగ్
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ వికాస్ పర్వ సభలో పాల్గొన్న సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ, అసోంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఐదుగురు ఎమ్మెల్యేలు పంచపాండవుల్లా పోరాడి, బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చారని తెలిపారు. పాలమూరు జిల్లాలో తుంగభద్ర, కృష్ణా నదులు పారుతున్నప్పటికీ రైతాంగానికి సమస్యలు తప్పడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.