: జాతీయ గీతాన్ని అవమానించిన ఫరూఖ్ అబ్దుల్లా
జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా జాతీయ గీతాన్ని అవమానించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారానికి హాజరైన ఆయన కార్యక్రమం చివర్లో జనగణమన ఆలపించినప్పుడు నిల్చున్నారు. అయితే అంతా అటెన్షన్ పొజిషన్లో నిల్చుని జాతీయగీతం ఆలపిస్తుండగా, ఆయన ఒక్కరే ఫోన్ లో మాట్లాడుతూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాకు ఎక్కడంతో వివాదం చెలరేగింది. జాతీయ మీడియాలో ఈ విషయం హల్ చల్ చేస్తోంది. కార్యక్రమంలో లాలూప్రసాద్ యాదవ్ ప్రక్కన కూర్చున్న ఆయన జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో అందరితో లేచి నిల్చుని ఫోన్ లో మాట్లాడడం విశేషం.