: కిం కర్తవ్యం... దేశంలోకి ఫిరాయింపుపై మరింత మంది అభిప్రాయం అడుగుతున్న వైకాపా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశంలోకి చేరిపోవాలని దాదాపుగా నిర్ణయించుకున్న ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, కార్యకర్తలందరి అభిప్రాయాలనూ అడిగి తెలుసుకుంటున్నారు. నిన్న రాచర్ల, గిద్దలూరు నేతలతో సమావేశమైన ఆయన, నేడు బెస్తవారిపేట, కొమరోలు గ్రామాలకు చెందిన అనుచరులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలుగుదేశం పార్టీలోకి వెళితే, కలిగే ప్రయోజనాలను ఆయన కార్యకర్తలకు వివరించినట్టు సమాచారం. అత్యధిక కార్యకర్తలు పార్టీ మారదామనే వెల్లడించగా, కొందరు మాత్రం ఇప్పుడున్న టీడీపీ నేతలతో గొడవలు వస్తాయని చెప్పారని తెలుస్తోంది. కాగా, ఆయన మహానాడు ముగిసిన తరువాత ఈ నెలాఖరున విజయవాడలో సీఎం సమక్షంలో పచ్చ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News