: బెంగాల్ సీఎంగా దీదీ ప్రమాణం... 42 మందిని కేబినెట్ లో చేర్చుకున్న మమత
పశ్చిమ బెంగాల్ కు వరుసగా రెండో పర్యాయం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పదవీ ప్రమాణం చేశారు. కోల్ కతాలోని రెడ్ రోడ్ లో అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో మమత చేత ఆ రాష్ట్ర గవర్నర్ ప్రమాణం చేయించారు. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన దీదీ... 42 మందితో కేబినెట్ ను ఏర్పాటు చేసుకున్నారు. తన కేబినెట్ లోని సభ్యుల చేత ఆమె సామూహిక ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖుల్లో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, అఖిలేశ్ యాదవ్, కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, అరుణ్ జైట్లీ, తదితరులున్నారు.