: నేడు ఎన్నికలు జరిగితే మోదీ పరిస్థితి ఏంటి?: ఏబీపీ-ఐఎంఆర్బీ సర్వే


ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలను చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తయిన వేళ, తామేం చేశామో ప్రజలకు చెప్పేందుకు ఆయన నేతృత్వంలోని బీజేపీ నేతలు కదలగా, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే, ప్రజలు ఎటువైపు నిలుస్తారన్న విషయమై ఏబీపీ న్యూస్-ఐఎంఆర్బీ ఇంటర్నేషనల్ సంస్థలు సంయుక్తంగా ఓ సర్వేను నిర్వహించాయి. ఈ సర్వేలో ప్రజలు బీజేపీకి 342 పార్లమెంట్ సీట్లను కట్టబెడతారని వెల్లడైంది. 2014 ఎన్నికల్లో బీజేపీ కూటమికి 45 శాతం ఓట్లు రాగా, ఇప్పడు ఎన్నికలు జరిగితే 52 శాతానికి ఓట్లు పెరగనున్నాయని తెలిపింది. ఇదే సమయంలో పంజాబ్ లో ఆ పార్టీ నష్టపోనుందని, అసోం, ఓడిశా సహా తూర్పు రాష్ట్రాల్లో లాభం పొందనుందని అంచనా వేసింది. గడచిన లోక్ సభ ఎన్నికలతో పోలిస్తే, తూర్పు రాష్ట్రాల్లో బీజేపీకి లభించే ఓట్ల శాతం 29 నుంచి 38కి పెరుగుతుందని పేర్కొంది. 47 శాతం మంది ప్రజలు మోదీని ప్రధానిగా అంగీకరిస్తున్నారని, 49 శాతం మంది ఆయన పనితీరు బాగుందని చెప్పారని పేర్కొంది. కాగా, మోదీ ప్రధానిగా 2014, మే 26న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News