: మహానాడులో నోరూరిస్తున్న వంటకాలు... మెనూ ఇదే!


తిరుపతిలో జరుగుతున్న మహానాడులో 30 వేల మంది కార్యకర్తలతో పాటు ఇతర ప్రతినిధులు, మంత్రులు, పాత్రికేయులకు మూడు రోజుల పాటు నోరూరించే పసందైన శాకాహార, మాంసాహార వంటకాలను పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎంపి మాంగంటి బాబు దగ్గరుండి మరీ సిద్ధం చేయిస్తున్నారు. మూడు టన్నుల ఆవకాయ ఊరగాయ ఇప్పటికే సిద్ధం కాగా, మెనూలో దాదాపు 30 రకాల వంటకాలు ఉండనున్నాయి. మహానాడు జరిగే మూడు రోజుల్లో శుక్రవారం, ఆదివారాల్లో మాంసాహారం, శనివారం మాత్రం శాకాహారంలోనే రకరకాల వంటకాలు వండి వడ్డించనున్నారు. ఆంధ్రమాత గోంగూర, ఈ సీజన్ స్పెషల్ మామిడికాయ పప్పు, దప్పళం, రైతా, మామిడి పులిహోర, మిక్స్ డ్ వెజిటబుల్ పచ్చడి, దోసకాయ చట్నీ, మిల్ మేకర్ గ్రేవీ కర్రీ, బీరకాయ రోటీ చట్నీ, దొండకాయ కార్న్ కోటెడ్ ఫ్రై, సంగటి, రాయలసీమ పులగోర, పచ్చిపులుసు, బిరియాని తొలి రోజు సిద్ధం అయ్యాయి. వీటితో పాటు ఫ్రూట్ సలాడ్, ఐస్ క్రీంలనూ రెడీ చేశారు. మధ్యాహ్నం 20 వేల మందికి భోజనాలను అందించనున్నామని, ఇందుకు రామదండు పేరిట 500 మందితో వాలంటీర్ల బృందాన్ని ఏర్పాటు చేశామని టీడీపీ నేతలు తెలిపారు.

  • Loading...

More Telugu News