: నేరస్తుడి ప్రాణాలు తీసే హక్కు అందరికీ ఉంది: హర్యానా డీజీపీ సంచలన వ్యాఖ్యలు
చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదని రాజ్యాంగం చెబుతుంటే, అందుకు విరుద్ధంగా ఓ నేరస్తుడి ప్రాణాలు తీసే హక్కు సామాన్యుడికి ఉందని హర్యానా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కేపీ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా వచ్చి మరొకరి ఇల్లును తగులబెట్టాలని చూస్తుంటే, పక్కనున్న సామాన్యుడికి ఆ నేరగాడిని హత్య చేసే హక్కు చట్టం కల్పిస్తుంది. ఎవరైనా మహిళను వేధిస్తున్నా, లేదా ఓ వ్యక్తిని చంపేందుకు ప్రయత్నిస్తున్నా, దాన్ని చూస్తున్న కామన్ మ్యాన్, ఆ క్రిమినల్ ప్రాణాలు తీయవచ్చు అని సింగ్ వ్యాఖ్యానించారు. పోలీసులు ఉన్నప్పటికీ, అక్కడున్న పరిస్థితిని బట్టి, ఏం చేయాలన్నది నిర్ణయించుకోవాల్సి వుంటుందని తెలిపారు.