: సీపీఐ నేతను కోర్టు బయట చెంప దెబ్బ కొట్టిన వ్యక్తి


పశ్చిమబెంగాల్ మిడ్నాపూర్ జిల్లా సీపీఐ నేత సుశాంత్ ఘోష్ ను న్యాయస్థానం బయట ఓ వ్యక్తి చెంపదెబ్బ కొట్టారు. 2011లో బినాచాప్ర గ్రామంలో ఘోష్ పూర్వీకులకు చెందిన ఇంటి సమీపంలో తవ్వగా 8 అస్థిపంజరాలు వెలుగు చూశాయి. కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోగా, సుప్రీంకోర్టు నుంచి ఆయన బెయిల్ పొందారు. అనంతరం ఈ కేసు విచారణ నిమిత్తం ఆయన నేడు స్థానిక కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఆయన కోర్టు బయట మీడియాతో మాట్లాడుతుండగా మనోరంజన్ సింగ్ అనే వ్యక్తి వచ్చి సుశాంత్ ఘోష్ చెంపపై కొట్టారు. ఆ 8 అస్థిపంజరాల్లో ఒకటి తన కుమారుడు స్వపన్ సింగ్ ది కూడా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై దాడిని అధికారపార్టీ కుట్రగా ఆయన పేర్కొనగా, సీపీఐ ఖండించింది.

  • Loading...

More Telugu News