: మీరెలాంటి వారన్న సంగతి మీ ప్రొఫైల్ పిక్ బయటపెడుతుంది


సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోతోంది. సామాజిక మాధ్యమంలో ఖాతా లేకపోతే నామోషీగా భావించే రోజులు వచ్చేశాయి. అయితే సోషల్ మీడియాలో ఎవరు ఎలాంటివారో తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మీరు పెట్టే ప్రొఫైల్ పిక్చర్ మీరెలాంటివారో చెప్పేస్తుందని నిపుణులు చెబుతున్నారు. డార్క్ కలర్ బ్యాక్ గ్రౌండ్ తో ఉన్న ఫోటోను ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టేవారు నిరాశావాదులు, మూడీగా ఉంటారని వారు సూచిస్తున్నారు. కలర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ తో గ్రాఫిక్స్ తో ఫోటోను ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టేవారు ఎక్సట్రావర్టు (కలివిడితనం గలవారు) లని నిపుణులు చెబుతున్నారు. తమ ఫోటోలను కాకుండా సెలబ్రిటీల ఫోటోలు పెట్టేవారు ఇంట్రావర్టు (కలివిడితనం లేని వారు) లని నిపుణులు తెలిపారు. బ్యాక్ గ్రౌండ్ డార్క్ గా ఉండి, అన్ కలర్ ఫుల్ ఇమేజెస్ పెట్టేవారు నెగెటివ్ ఎమోషన్స్ కలిగి ఉంటారని వారు చెప్పారు.

  • Loading...

More Telugu News