: రంజాన్ పండగకు 5 కోట్ల రూపాయలు విడుదల చేసిన మహమూద్ అలీ
తెలంగాణ వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మహమూద్ అలీ నిధులు విడుదల చేశారు. పది జిల్లాలలో రంజాన్ వేడుకలు నిర్వహించేందుకు వీలుగా జిల్లాలకు నిధులు మంజూరు చేశామని ఆయన చెప్పారు. ప్రతి జిల్లాకు 50 లక్షల రూపాయల చొప్పున మొత్తం 5 కోట్ల రూపాయలు విడుదల చేశామని ఆయన వెల్లడించారు. రంజాన్ ను పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్ అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రంజాన్ వేడుకలు నిర్వహించుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు.