: విజయవాడపై చక్కర్లు కొట్టి హైదరాబాదు వెనుదిరిగిన స్పైస్ జెట్ విమానం
కృష్ణా జిల్లా గన్నవరంలో ల్యాండ్ కావాల్సిన స్పైస్ జెట్ విమానం విజయవాడపై చక్కర్లు కొట్టింది. విజయవాడలో వాతావరణం మబ్బులు పట్టి బీభత్సంగా ఉండడంతో గన్నవరం ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించిన పైలట్ రన్ వేను గుర్తించడంలో ఇబ్బంది పడ్డారు. దీంతో నగరంపై చక్కర్లు కొట్టిన స్పైస్ జెట్ విమానం తిరిగి హైదరాబాదు బయల్దేరింది. మరోపక్క, బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి రావాల్సిన విమానాన్ని బెంగళూరులోనే నిలిపేశారు.