: ఇప్పుడు నేను సింగిల్...మూడేళ్ల నుంచే ఇలా ఉన్నాను!: కాజల్ అగర్వాల్


'నేను సింగిల్ గా ఉన్నానని ఎవరన్నారు?' అంటూ ఇటీవల కథానాయిక సమంత అంటే, తాజాగా కాజల్ కూడా అదే తరహాలో మాట్లాడింది. 'మూడేళ్ల నుంచీ సింగిల్ గా ఉంటున్నా'నని చెప్పి అందర్నీ ఆశ్చర్యంలో పడేసింది. అయితే, మూడేళ్ల క్రితం ఎవరితో ప్రేమాయణం నడిపిందో మాత్రం చెప్పలేదు. మళ్లీ నచ్చిన వ్యక్తి దొరికితే పీకల్లోతు ప్రేమలో మునిగిపోతానని చెప్పింది. అయితే, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది. వేరే రంగానికి చెందిన వ్యక్తి అయితే అనుబంధం పెరుగుతుందని చెప్పింది. రియల్ లైఫ్‌ లో తానంత రొమాంటిక్ కాదని, అందుకే నిద్రలేచిన దగ్గర్నుంచి ఐ లవ్ యూ చెప్పడం తనవల్ల కాదని తెలిపింది. తనకు నచ్చినట్టు ఉంటానని చెప్పింది. మంచి అవగాహన ఉంటే చాలని తెలిపింది. పొతే, అమ్మడు ప్రస్తుతం దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్తతో పీకల్లోతు ప్రేమలో ఉందని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News