: ‘కిక్ బాక్సర్: రిటాలియేషన్’ చిత్రంలో మైక్ టైసన్


‘కిక్ బాక్సర్: రిటాలియేషన్’ చిత్రంలో అలనాటి బాక్సింగ్ వీరుడు మైక్ టైసన్ నటించనున్నాడు. ‘కిక్ బాక్సర్: వెంజియాన్స్’ సీక్వెల్ గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కాలిఫోర్నియా, నెవడాలలో జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ రాబర్ట్ హిక్ మ్యాన్ మాట్లాడుతూ, 14 మంది ఛాంపియన్ క్రీడాకారులతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని, ఇప్పుడు టైసన్ కూడా తమ సినిమా యూనిట్ లో ఉండటం మరింత ఉత్సాహంగా ఉందని చెప్పారు. ‘కిక్ బాక్సర్: రిటాలియేషన్’ చిత్రం షూటింగ్ నిమిత్తం ఈ జూన్ లో థాయ్ లాండ్ కు వెళ్లనున్నట్లు చెప్పారు. కాగా, 1989లో విడుదలైన ‘కిక్ బాక్సర్’ చిత్రానికి రీమేక్ గా ‘కిక్ బాక్సర్: వెంజియాన్స్’ ను తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చూస్తున్నట్టు దర్శకుడు జాన్ స్టాక్ పేర్కొన్నారు. కాగా, మైక్ టైసన్ ఇటీవల నటించిన చిత్రాల్లో ‘స్కారీ మూవీ 5’,‘గ్రడ్జ్ మ్యాచ్’,‘ఐపీ మ్యాన్ 3’ ఉన్నాయి.

  • Loading...

More Telugu News