: వైఎస్సార్సీపీకి ఇప్పుడు ‘ఆపరేషన్ వికర్ష్’ నడుస్తోంది: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు


వైఎస్సార్సీపీకి ఒకప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ ఉండేదని, ఇప్పుడు ఆపరేషన్ వికర్ష్ నడుస్తోందని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని ఖరారు చేసిన అనంతరం ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు చాలా అభ్యంతరకరంగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను తామేమీ కొనుగోలు చేయడం లేదని, జగన్ విధానాలు నచ్చకే వారు ఆ పార్టీని వీడుతున్నారని అన్నారు. అసలు, ఎమ్మెల్యేల కొనుగోలు అన్నది వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే మొదలైందని, దాని సృష్టికర్త రాజశేఖరరెడ్డేనని అన్నారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్, తమ పార్టీ నుంచి రాజ్యసభకు మరో నిందితుడిని పంపుతున్నారని ఆరోపించారు. ఇటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు ఎక్కడుందని ప్రత్తిపాటి ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News