: కేంద్ర న్యాయశాఖ మంత్రికి ప్రధాని మద్దతు
బొగ్గు స్కాం వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర న్యాయశాఖ మంత్రి అశ్వినికుమార్ కి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మద్దతు పలికారు. న్యాయశాఖ మంత్రి రాజీనామ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బొగ్గు కేటాయింపుల అంశం కోర్టులో ఉందని, దీనిపై విచారణ జరుగుతుంది కాబట్టి స్పందించలేమని చెప్పారు.
కాగా, పార్లమెంటు వ్యవస్థను విపక్షాలు అపహాస్యం పాలు చేస్తున్నాయని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచం ముందు భారత్ నవ్వుల పాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సభ సజావుగే కొనసాగేందుకు విపక్షాలు సహకరించాలని మన్మోహన్ కోరారు. చైనా విషయంలో ప్రభుత్వానికి ప్రణాళిక ఉందని పేర్కొన్నారు.