: పండ్లు ఎక్కువగా తింటే పండంటి బిడ్డ పుడతాడట!
‘చూడటానికి రెండు కళ్లు చాలట్లేదు’, ‘గాజు బొమ్మలా ఉంది’, ‘అబ్బా, ఎంత అందంగా ఉంది/ ఉన్నాడు’... అనే వాక్యాలు అందమైన చిన్నారులను చూస్తున్నప్పుడు అలవోకగా మన నోటి వెంట వస్తూఉంటాయి. అంత అందంగా పుట్డానికి ఆ చిన్నారుల తల్లులు వారు గర్భవతులుగా ఉన్న సమయంలో తీసుకున్న ఆహారమే కారణమని, ముఖ్యంగా పండ్లు ఎక్కువగా తినడం వల్ల ‘అందాల బొమ్మలు’ లాంటి పిల్లల్ని కనవచ్చనే విషయాన్ని యూనివర్శిటీ ఆఫ్ అల్బెర్టా చేసిన ఒక సర్వేలో తేలింది. ఈ సర్వే నిమిత్తం 688 మంది చిన్నారులను, వారి తల్లులను కలుసుకున్నారు. గర్భవతులుగా ఉన్న సమయంలో ఆ చిన్నారుల తల్లులు ఎటువంటి ఆహార నియమాలు పాటించారో అడిగి తెలుసుకున్నారు. వీరిలో అధిక శాతం తల్లులు తమ ఆహారంలో పండ్లు ఎక్కువగా తీసుకున్నట్లు ఆ సర్వే ద్వారా తెలిసింది. గర్భవతులుగా ఉన్న సమయంలో పండ్లు తీసుకోవడమనేది పుట్టబోయే బిడ్డ తెలివితేటలపై కూడా ప్రభావం చూపుతుందని తాజా సర్వేలో తేలింది.