: విద్యార్థులతో ‘లెక్క’ తప్పిన పాకిస్తానీ మాస్టారు దొరికిపోయాడు


ఎంతో గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తికి కళంకం తెచ్చాడు ఆ మాస్టారు. కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఒక లెక్కల మాస్టారు అడ్డంగా దొరికిపోయిన సంఘటన కువైట్ లో జరిగింది. అరబిక్ డైలీ కథనం ప్రకారం, 65 సంవత్సరాల వయస్సు గల పాకిస్తాన్ కు చెందిన ఒక ఉపాధ్యాయుడు కువైట్ లో ముప్ఫై ఐదేళ్లుగా నివసిస్తున్నాడు. ఒక ప్రైవేటు స్కూల్ లో లెక్కల మాస్టారుగా పనిచేస్తున్నాడు. అయితే, తన ఇంటివద్ద కూడా ట్యూషన్లు చెబుతుంటాడు. తన వద్ద ట్యూషన్ కు వచ్చే అమ్మాయిలపై లైంగికంగా వేధిస్తుండేవాడు. ఒకరోజు, ఒక విద్యార్థినిపై సదరు మాస్టారు లైంగిక వేధింపులకు పాల్పడుతుండగా అక్కడే ఉన్న మిగిలిన అమ్మాయిలు ఆ దృశ్యాన్ని వీడియో తీశారు. అనంతరం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో, పోలీసులు రంగంలోకి దిగారు. విచారణలో సదరు ఉపాధ్యాయుడు తన తప్పును అంగీకరించినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News