: విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌తో మోదీ గిన్నీస్ రికార్డుల‌కెక్కారు: పొంగులేటి సుధాకర్ రెడ్డి


భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వంపై తెలంగాణ నేత‌, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. రెండేళ్ల పాల‌న అంటూ బీజేపీ నానా హ‌డావుడి చేస్తోందని, రెండేళ్లలో ప్ర‌జ‌ల‌కు మోదీ ప్ర‌భుత్వం చేసిందేమీ లేదని ఆయ‌న మండిప‌డ్డారు. మోదీ స్వ‌దేశం క‌న్నా విదేశాల్లోనే ఎక్కువ‌గా ఉన్నార‌ని, విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌తో ప్ర‌ధాని గిన్నీస్ రికార్డుల‌కెక్కారని ఆయ‌న ఎద్దేవా చేశారు. ‘మోదీ దేశాభివృద్ధిపై చెప్పింది కొండంత, చేసింది మాత్రం గోరంత’ అని ఆయ‌న విమ‌ర్శించారు. ఆర్ఎస్ఎస్ అజెండాతోనే మోదీ ప్ర‌భుత్వం న‌డుస్తోందని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News