: ఆ నేతలు ఒక్క కల్వర్ట్ నిర్మించారా? చెరువుకు పూడిక తీయించారా?: మంత్రి హరీష్ రావు విమర్శ
గతంలో మంత్రులుగా పని చేసిన సునీతా లక్ష్మారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డిలు వారి హయాంలో ఒక కల్వర్ట్ నిర్మాణం చేపట్టారా? చెరువుకు పూడికతీత కానీ తీశారా? అని టీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ప్రాజెక్టుల నిర్మాణంపై ఆరోపణలు చేస్తున్న ఆ నేతలపై ఆయన మండిపడ్డారు. ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూస్తున్న టీడీపీ, కాంగ్రెస్ నేతలను గ్రామాల్లోకి రానివ్వకుండా అడ్డుకోవాలని అన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులు కడితే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరొస్తుందోనని ప్రతిపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో రకంగా ఆ నేతలు ప్రవర్తిస్తున్నారని హరీశ్ విమర్శించారు.