: అత్యాచార బాధిత 13ఏళ్ల బాలికకు ఎయిమ్స్‌లో కేజ్రీవాల్ పరామర్శ
కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో పలువురు గుర్తుతెలియని వ్యక్తులు మతిస్థిమితం సరిగ్గాలేని 13ఏళ్ల ఓ బాలికను అత్యాచారం చేసి రైల్వే ట్రాక్ ప్రాంతంలో పడేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ బాలిక ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతోంది. ఆసుపత్రిలో కోలుకుంటోన్న ఆ బాలికను ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఢిల్లీలో నేరాలు అదుపులోకి రావాలంటే ప్రజలు, న్యాయాధికార సంస్థలు కలిసి పనిచేసేలా కేంద్రం నిర్ణయం తీసుకోవాలన్నారు. ఢిల్లీలో పూర్తి స్థాయి శాంతి భద్రతల అంశం ఆ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉండాలని ఇటువంటి సంఘటనలు మనకు గుర్తు చేస్తున్నాయని కేజ్రీవాల్ అన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా బాలికను పరామర్శించడానికి ఎయిమ్స్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. బాధిత బాలిక శరరీరంలో తీవ్రమైన గాయాలు కనిపించాయని, సర్జరీ చేశామని వైద్యులు తెలిపారు. అత్యారానికి పాల్పడ్డ ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.