: 50 ఏళ్ల పోరాటానికి ఫలితం దక్కింది... ఆ ఆనందంతో ఆ రైతు గుండె ఆగింది!
ఆ రైతు 50 ఏళ్లు పోరాడాడు. చివరికి ఫలితం లభించింది. తన పోరాటానికి ఫలితంగా తీపికబురు వచ్చిందని తెలియగానే ఆ సంతోషం పట్టలేక గుండె ఆగి చనిపోయాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని బికనీర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. రెవెన్యూ రికార్డుల్లో తప్పుగా ఉన్న తన పేరును సరిచేసుకోవడానికి అక్కడి జైమాల్సర్ గ్రామానికి చెందిన రైతు మంగిదాస్ అధికారుల చుట్టూ 50ఏళ్లు తిరిగాడు. తనకు 25ఏళ్లు ఉన్నప్పుడు తన పోరాటాన్ని ఆరంభిస్తే ఇప్పుడు అతనికి 75ఏళ్లు వచ్చాయి. చివరికి పత్రాల్లో అధికారులు అతని పేరు సరిగ్గా నమోదు చేశారు. ఈ విషయాన్ని తన కొడుకు ద్వారా తెలుసుకున్న మంగిదాస్ ఆనందం పట్టలేకపోయాడు. ఒక్కసారిగా గుండె ఆగిపోయింది. దీంతో తుది శ్వాస విడిచాడు.