: రాజ్యసభకు సాయిరెడ్డి నామినేషన్ నేడే!... జగన్ సహా పార్టీ నేతలతో కలిసి మరికాసేపట్లో అసెంబ్లీకి!
పార్లమెంటులో పెద్దల సభగా పరిగణిస్తున్న రాజ్యసభ బరిలోకి వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి దూకుతున్నారు. మరికాసేపట్లో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను వెంటబెట్టుకుని ఆయన అసెంబ్లీకి వెళ్లి తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఏపీ కోటాలోని నాలుగు సీట్లలో ఓ సీటు వైసీపీకి దక్కనుంది. ఈ సీటుకు విజయసాయిరెడ్డిని దాదాపుగా ఖరారు చేసిన జగన్... ఈ మేరకు కొద్దిసేపట్లో అధికారిక ప్రకటన చేయనున్నారు. ఆ వెంటనే సాయిరెడ్డి నామినేషన్ దాఖలు చేస్తారు.