: రైల్వే టికెట్ కేన్సిల్ చేసుకోవాలా?...అయితే, 139 కి డయల్ చేయండి


ట్రైన్ టికెట్ రద్దు చేసుకోవాలంటే ప్రయాణికులు పెద్ద ప్రయాస పడవలసి వస్తోంది. దీనిని గుర్తించిన రైల్వే శాఖ ఆ సమస్య నుంచి వారిని బయటపడేసేందుకు సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వెయింటింగ్‌ లిస్టులో ఉన్న రైల్వే టికెట్‌ ను రద్దు చేసుకోవాలంటే 139కి డయల్‌ చేయడం లేదా ఐఆర్‌ సీటీసీ వెబ్‌ సైట్‌ లో లాగ్ ఆన్ కావడం ద్వారా టికెట్‌ రద్దు చేసుకునే వెసులుబాటును కల్పించింది. రైలు బయలుదేరే సమయానికి నాలుగు గంటల ముందు వరకు ఆన్‌ లైన్‌ లో టికెట్‌ రద్దు చేసుకునే వెసులుబాటు కల్పించినట్టు రైల్వే మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. దీనితో పాటు రైల్వే స్టేషన్‌ లోని కౌంటర్ల వద్ద కూడా ప్రయాణికులు తమ టికెట్‌ను రద్దు చేసుకోవచ్చని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News