: ‘బుల్లెట్’ బాబా గుడి... దండలేసి దండం పెడుతున్న గ్రామస్తులు!
భారత్ లో ఎంతో మంది ‘బాబా’లను చూశాము. వారి మహిమలు, చేసే పూజలు, ఉత్సవాలు... వాటితో తరించిపోయే భక్తులను చూస్తూనే ఉన్నాము. రాజస్థాన్ లోని జోథ్ పూర్ లో ‘బుల్లెట్ బాబా’ కూడా అందులో ఒకరు. జోథ్ పూర్ కు 50 కిలోమీటర్ల దూరంలోని పాలి జిల్లాలో ఓం బన్నా అనే గుడి ఉంది. అందులో ఆయన వాడిన ఒక ‘బుల్లెట్’ దర్శనమిస్తుంది. ప్రస్తుతం ఆయన భౌతికంగా లేకపోయినప్పటికీ ఆయన ఉపయోగించిన 350 సీసీ రాయల్ ఎన్ ఫీల్డ్ ఒకటి పూజలందుకుంటోంది. దీనికే దండలు వేసి దండం పెట్టుకుంటుంటారు భక్తులు. ఈ వింతైన ఆరాధన గురించి తెలుసుకోవాలంటే గతంలో జరిగిన సంఘటనలను ప్రస్తావించుకోవాలి. 1988 డిసెంబర్ 2న ఓం సింగ్ రాథోడ్ అలియాస్ ఓం బన్నా అనే వ్యక్తి రాయల్ ఎన్ ఫీల్డ్ పై వెళుతుండగా ప్రమాదానికి గురై చనిపోయాడు. ఆ వాహనాన్ని పోలీసులు స్టేషన్ కు తరలించారు. అసలు కథ, ఇక్కడే జరిగింది. పోలీస్ స్టేషన్ లో ఉంచిన ఆ వాహనం తిరిగి ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుంది. దీంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. ఇదంతా ఆకతాయిలెవరైనా చేసి ఉంటారేమోనని భావించిన పోలీసులు ఆ వాహనంలో పెట్రోల్ తీసేసి మళ్లీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. తెల్లవారేసరికి, మళ్లీ మామూలే. ప్రమాదం ఎక్కడైతే జరిగిందో అక్కడికే మళ్లీ ఆ వాహనం చేరుకుంది. దీంతో అక్కడి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఓం బన్నా ఆత్మ అక్కడే ఉందని భావించి, ఈ వాహనానికి ఒక గుడి కట్టి, అందులో రాయల్ ఎన్ ఫీల్డ్ ఉంచి పూజలు చేస్తున్నారు.