: నవంబర్ 9, 10న పాక్ లో మోదీ పర్యటన?
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి పాక్ వెళ్లనున్నారని సమాచారం. ఈ ఏడాది నవంబర్ లో పాకిస్థాన్ లో జరగనున్న సార్క్ సదస్సుకు ఆయన హాజరు కానున్నారు. నవంబర్ 9, 10 తేదీల్లో ఈ సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా సార్క్ శాటిలైట్ పై ఆయన చర్చించే అవకాశం కనిపిస్తోంది. కాగా, ప్రధాని పాక్ పర్యటనపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. గత ఏడాది ఎవరూ ఊహించనిరీతిలో అకస్మాత్తుగా లాహోర్ లో జరిగిన నవాజ్ షరీఫ్ మనవరాలి పెళ్లికి వెళ్లిన మోదీ నూతన దంపతులను ఆశీర్వదించిన సంగతి, ఆ విషయంలో మోదీ ధైర్యాన్ని, వ్యూహాన్ని ప్రపంచదేశాలు కీర్తించిన సంగతి తెలిసిందే.